కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆలూరులో న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. హైకోర్ట్ బెంచ్‌ని కర్నూలులో ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందని... నేటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే అంశంపై 45 రోజులు దీక్ష చేపట్టినప్పుడు కాంగ్రెస్, వైకాపా నాయకులు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ అటువైపుగా అడుగులు పడిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశాల్లోనే హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంపై పట్టుబట్టాలని వారు కోరారు.