రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని... కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదులు ధర్నా చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. హైకోర్టు ఏర్పాటు అంశంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. హైకోర్టు ఏర్పాటు అంశం ఇప్పటిది కాదని... శ్రీ బాగ్ ఒప్పందంలో ఉందని బార్కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరా నాగరాజురావు గుర్తుచేశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన జగన్... న్యాయం చేయాలని మహిళా న్యాయవాదులు కొరారు.
హైకోర్టు ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించాలి: లాయర్లు - latest kurnool news
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని... కర్నూలు జిల్లా నంద్యాలలో లాయర్లు ధర్నా చేశారు. హైకోర్టు ఏర్పాటు అంశంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు.
lawyer dharna about high court in kurnool district