కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని ప్రజా వైద్యశాల వీధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విశ్వనాథ్ శెట్టితో భార్య పుష్పలతకు కొన్ని రోజులుగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మేడపైకి వెళ్లి ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. కేకలు వేయడంతో స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
తల్లి ఆత్మహత్య... అనాథలైన ఇద్దరు పిల్లలు - dhone city
క్షణికావేషంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం కారణంగా.. చిన్న పిల్లలు అనాథలుగా మిగిలారు. భర్తతో మనస్పర్ధల కారణంతో భార్య పుష్పలత ఆత్యహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో చోటు చేసుకుంది.
తల్లి ఆత్మహత్య... అనాథలైన పిల్లలు
స్పందించిన కుటుంబ సభ్యులు గోనె సంచి కప్పి మంటలు ఆర్పారు. అప్పటికే పుష్పలత మృతి చెందింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. క్షణికావేషంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం కారణంగా... చిన్న పిల్లలు అనాథలుగా మిగిలారు. పుష్పలత గత మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ... నాన్న.. నన్నెందుకు ఇలా చేశావ్!