ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలు తీర్చేవారే... ప్రచారానికి రండి' - ఫెక్సీ

ఓటు ఒక ఆట వస్తువు కాదు అమ్ముకోవడానికి... ఓటు మన హక్కు అని ఆ గ్రామస్తులు నినదించారు. అంతేనా... ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి... సమస్యలు తీర్చినోళ్లే పల్లెలో ప్రచారం చేసుకోవచ్చని డిమాండ్‌ చేశారు. గ్రామాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ సభ్యులు చూపిన చొరవ అందర్నీ ఆలోచింప చేస్తోంది.

సమస్యలను ఫ్లెక్సీల రూపంలో తెలుపుతున్న గ్రామస్థులు

By

Published : Mar 12, 2019, 4:13 PM IST

సమస్యలను ఫ్లెక్సీల రూపంలో తెలుపుతున్న గ్రామస్థులు
కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో యువకులు ఒక వినూత్న ఆలోచన చేశారు. గ్రామ సమస్యలను ఫ్లెక్సీలో రాసి గ్రామ ముఖద్వారంలో అతికించి పెట్టారు. రావాల్సినవి-కావాల్సినవి అంటూ వేర్వేరు జాబితా రూపొందించింది గ్రామ యువత. ఎవరు వీటిని పరిష్కరిస్తారో వారే తమ ఊరిలో ప్రచారం చేసుకోవచ్చని నిక్కచ్చిగా అందులో చెప్పేశారు.

ఊరి బాగుకోసం కొంతమంది యువకులు... స్వచ్ఛంద సంస్థగా ఏర్పడ్డారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిపరిష్కారానికి ప్రయత్నించారు. ఎన్నిసార్లు కాళ్లు అరిగేలా తిరిగినా చింత తీరలేదు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. దీన్నే అవకాశంగా తీసుకొని నేతలను ప్రశ్నించాలని తీర్మానించుకున్నారు. తమకున్న సమస్యలనే ఇలా ఫ్లెక్సీ రూపంలో నిలబెట్టారు.

ఫ్లెక్సీలో రాసి పెట్టిన ప్రజాసమస్యలు తీరిస్తేనే ఊరిలో ప్రచారం చేసుకోమని నాయకులకు చెబుతున్నారీ పల్లెవాసులు. గ్రామానికి అవసరమైన పది రకాల సమస్యలు అందులో రాశారు. తాగునీరు, సాగునీరు, క్రీడాస్థలం, అదనపు ప్రభుత్వ పాఠశాల భవనం, తపాళా కార్యాలయం, పశు వైద్యశాల, డ్రైనేజీ కాలువలు, ఎల్ఈడీ బల్బులు, కమ్యూనిటీ హాలు, బస్టాండ్ వంటి సమస్యల చిట్టాను నేతల ముందు ఉంచారు. వీటిని తీర్చే నేతలే తమ గ్రామంలో అడుగుపెట్టాలని ఘంటాపథంగా చెబుతున్నారీ పల్లెజనం.

ABOUT THE AUTHOR

...view details