వైభవంగా ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలు - sravana masam
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుందలో ఈరన్నస్వామి వారి శ్రావణ మాస ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
కర్నూలు ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాలు
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మూడో సోమవారం దాదాపు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామి వారికి భక్తులు నైవేద్యం వండి సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. ఈ దిశగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.