'కర్నూలు ట్రిపుల్ ఐటీనీ సమూలంగా మార్చేస్తాం' - solve
అరకొర సౌకర్యాలతో సతమతమవుతున్న కర్నూలు ట్రిపుల్ ఐటీని పూర్తిగా మారుస్తామని ఆ సంస్థ డైరెక్టర్ అన్నారు. విద్యార్థులకు ఈ ఏడాది నుంచి సాధ్యమైనంత వరకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈటీవీ భారత్తో చేపడుతున్న పనుల గురించి వివరించారు.
సాధ్యమైనంత త్వరగా కర్నూలు ట్రిపుల్ ఐటీలో సమస్యలను అధిగమించి... విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని... ఆ సంస్థ డైరెక్టర్ సోమయాజులు స్పష్టం చేశారు. త్వరలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈటీవీ భారత్కు వివరించారు. సొంత వసతి గృహ లేకపోవటం, నీటి సమస్య, విద్యార్థినులకు భద్రత లేమి వంటి ఇబ్బందులను తొలగిస్తామని ఆయన అంటున్నారు. జగన్నాథగట్టు ప్రాంగణంలోనే... నూతన హాస్టల్ భవనాల నిర్మాణం దాదాపు పూర్తైందని... త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అమ్మాయిలకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నందున... వారికి నగరంలోని ఓ ప్రైవేట్ వసతి గృహంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టామని... బోధనా సిబ్బంది తగినంతమంది ఉన్నారని చెబుతున్న సోమయాజులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.