కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జిల్లా ఎస్పీ ఫకీరప్పతో కలిసి ఆయన పర్యటించారు. పట్టణంలో కూరగాయల మార్కెట్ల వికేంద్రీకరణలో భాగంగా 8 ప్రదేశాల్లో మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిత్యవసరాల సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్నం 1 తర్వాత ఆస్పత్రులు, మందుల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. లాక్డౌన్ క్రమంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉందని ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
కర్నూలులో 8 చోట్ల రైతు బజార్లు : కలెక్టర్ వీరపాండియన్
కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉండి సహకరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు. కర్నూలులోని రైతు బజార్లను వికేంద్రీకరించి 8 ప్రదేశాల్లో మార్కెట్లు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. లాక్డౌన్ పూర్తిస్థాయి అమలుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ ఫకీరప్ప
కలెక్టర్ వీరపాండియన్