ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్చి 2న తెదేపాలోకి కోట్ల - ap latest news

మార్చి 2న తెదేపాలోకి  చేరబోతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో  కాంగ్రెస్ తీసుకునే విధానపరమైన నిర్ణయాలు నచ్చకే పార్టీ నుంచి బయటికి వెళుతున్నామని తెలిపారు.

మార్చి2న తెదేపాలోకి కోట్ల

By

Published : Feb 27, 2019, 8:35 PM IST

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి కోట్ల దంపతులు రాజీనామా చేశారు.మార్చి 2న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానంకనీసం తమ అభిప్రాయాలు తీసుకోలేదని వాపోయారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు విషయం గురించి చర్చించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవలంభించే విధానాలు నచ్చకే పార్టీ వీడుతున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు ప్రాజెక్టులపై విడుదల చేసిన జీవోలకు విశ్వసనీయత ఉందన్నారు. వాటిపై వచ్చే విమర్శలను ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details