రాయలసీమలో తొలిసారి కిడ్నీ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసి.. కర్నూలు ప్రభుత్వాసుపత్రి మరో మైలురాయిని అందుకుంది. జిల్లాలోని చెరుకులపాడుకు చెందిన రామాంజనేయులుకు రెండు కిడ్నీలు చెడిపోగా.. ఒక కిడ్నీని ఇచ్చి కుమారుడుని బతికించుకునేందుకు తల్లి బజారమ్మ ముందుకొచ్చింది. నిమ్స్ మాజీ ప్రొఫెసర్ ఏవిఎస్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తి చేశారు. వైద్య బృందాన్ని కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు. రోగికి అయ్యే మందుల ఖర్చును జిల్లా యంత్రాంగమే భరిస్తుందని కలెక్టర్ తెలిపారు.
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం - hospital
కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ఆపరేషనే చేసిన వైద్య బృందాన్ని కలెక్టర్ అభినందించారు. రోగికయ్యే మందుల ఖర్చును జిల్లా యంత్రాంగమే భరిస్తుందని తెలిపారు.
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్