కర్నూలు నగరంలో మలబార్ గోల్డ్‌లో పనిచేసే జిజో మ్యాథూస్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాకు చెందిన మ్యాథూస్ మలబార్ గోల్డ్ షాప్‌లో అకౌంటెంట్‌గా పని చేసేవాడు. ఇటీవల సంస్థ ఖాతా నుంచి 12 లక్ష రూపాయలు మ్యాథూస్తో పాటు మరికొందరు ఖాతాల్లోకి మళ్లినట్లు యాజమాన్యం గుర్తించింది. ఈ ఘటనపై కేరళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో మ్యాథూస్ కర్నూలు నగరంలో తను ఉంటున్న అపార్ట్మెంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలులో ఉరివేసుకున్న కేరళవాసి - మలబార్ గోల్డ్ ఉద్యోగి అత్మహత్య
అతడు పనిచేసే సంస్థలోనే నగదు మాయం చేసిన కేసులో నిందితుడు... తప్పు చేశానని అంగీకరించాడో... శిక్ష పడుతుందని భయపడ్డాడో... ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి తనకు తానే శిక్ష వేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలులో జరిగింది.
కేరళ వ్యక్తి కర్నూలులో ఆత్మహత్య