ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు స్కీమ్​ అన్నాడు.. డబ్బులతో ఉడాయించాడు - కర్నూలు జిల్లా

కారు స్కీమ్​ అన్నాడు.. నెల నెలా 10వేలు వసూలు చేశాడు. పాలసీ అయిపోయింది... కారు ఏదని అడిగితే పరారయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటు చేసుకుంది.

కారు స్కీమ్​ అని ....టోకరా పెట్టిన లక్కిడిప్​ నిర్వాహకుడు

By

Published : Aug 5, 2019, 6:04 PM IST

కారు స్కీమ్​ అని ....టోకరా పెట్టిన లక్కీడిప్​ నిర్వాహకుడు

కర్నూలు జిల్లా నంద్యాలలో జేవీసీ ఎంటర్​ప్రైజెస్ పేరుతో ఒక్కో సభ్యుడి దగ్గర నెలకు రూ.10 వేలు వసూలు చేశాడు లక్కీ డిప్​ నిర్వాహకుడు. స్కీం పూర్తైన తరువాత సభ్యులకు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో భాదితుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో శీగు శ్రీనివాసులు అనే బాధితుడు డీఎస్పీ కార్యాలయం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. నెలకు రూ. 10 వేల చొప్పున దాదాపు నాలుగు లక్షల రూపాయలు చెల్లించినట్లు బాధితుడు తెలిపాడు. స్కీమ్​ నిర్వాహకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు శ్రీనివాసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details