ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడులు.. అక్రమ మద్యం స్వాధీనం - చిత్తూరు జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం అమ్మకాలు, రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

illicit liquor
illicit liquor

By

Published : Jun 3, 2021, 9:56 PM IST

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో పోలీసులు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. మినీ ట్రక్కులో రవాణా చేస్తున్న రూ 1.20 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లను సీజ్ చేశామని సీఐ సోమశేఖర్, ఎస్సై వీరస్వామి తెలిపారు. బొమ్మనహల్ మండలం కానాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

చిత్తూరు జిల్లాలో..

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం సాయినగర్ వద్ద ఉన్న ఒక గోదాములో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ.50 లక్షలు విలువైన మద్యం బాటిళ్లు, రూ.15 లక్షల విలువ చేసే 48 వేల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి ఓ కారును సీజ్ చేశారు.

జి.డి.నెల్లూరు మండలం పాతపాల్యం గ్రామంలో పొలంలో దాచి పెట్టిన కర్ణాటక బాటిళ్లను పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.24 లక్షలు ఉంటుందని ఏఎస్పీ మహేష్ వెల్లడించారు. ఈ కేసులో సుధాకర్ నాయుడు, కుమార స్వామి నాయుడు అనే వ్యక్తులను అరెస్టు చేశారు. ఓ ట్రాక్టర్​ను​ స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా నందవరం మండలంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ సీఐ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేసి తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న షేక్ మహమ్మద్ అలీ, రమణయ్యను అరెస్టు చేశారు. వారి నుంచి 432 తెలంగాణ మద్యం సీసాలు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ ద్విచక్ర వాహనంపై నందవరం మండలంలోని పలు గ్రామాలకు అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు సెబ్ సీఐ వెల్లడించారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:Corona cases: రాష్ట్రంలో కొత్తగా 11,421 కరోనా కేసులు, 81 మరణాలు

ABOUT THE AUTHOR

...view details