అక్రమ నిర్మాణాల ద్వారా సాధారణ వ్యాపారస్తులకు నష్టం జరుగుతోందన్న ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సంత మార్కెట్లో ఆక్రమణల వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. పురపాలిక కమిషనర్ వెంకట రామయ్య ఆదేశాల మేరకు.. అధికారులు ఆక్రమణలు తొలగించారు. రేకుల షెడ్లు తీసేయించి.. సాధారణ వ్యాపారులు ఇబ్బంది పడకుండా చూస్తామన్నారు.
ఆళ్లగడ్డ సంత మార్కెట్లో ఆక్రమణలు తొలిగింపు - illegal constructions
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సంత మార్కెట్లో ఆక్రమణలను పురపాలక సిబ్బంది తొలగించారు. గతవారం ఈటీవీ భారత్లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించి షెడ్డులను తొలగించారు.
ఆళ్లగడ్డ సంత మార్కెట్లో ఆక్రమణలు తొలిగింపు