తెదేపా అధినేత చంద్రబాబుకు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ దయాగుణం వల్లే చంద్రబాబు ఇంకా తిరగల్గుతున్నారన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్.. తాను జగన్ భక్తుడినని, ఆయణ్ని ఏమైనా అంటే ఊరుకునేది లేదన్నారు. జగన్ మూడో నేత్రం తెరిస్తే భస్మం అవుతారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
‘‘మంత్రి కంటే ముందు మేం జగన్ అనుచరులం.. భక్తులం. మంత్రి పదవి ఉంటుంది..ఊడుతుంది. దాని గురించి ఎప్పుడూ మేం భయపడం. కానీ జగన్ అనుచరులం.. భక్తులం అనేదే మాకు అన్నిటికంటే ఎక్కువ. అదే మాకు శాశ్వతం’’ అని అనిల్ వ్యాఖ్యానించారు.