ప్రయాణానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడి గ్రామంలో...మూడేళ్ల నిరీక్షణకు ఫలితం లభించింది. చివరికి వారి ఊరికి బస్సు రావడంతో వారి సంతోషానికి అవధుల్లేవు. ఆనందంతో... డ్రైవర్, కండక్టర్లకు సన్మానం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నాటక సరిహద్దు ప్రాంతమైన హొళగుంద మండల కేంద్రానికి గతంలో కేఎస్ఆర్ టీసీ బస్సులు తిరిగేవి. అనివార్యకారణాల వల్ల మూడేళ్ల క్రితం బస్సు రాకపోకలు ఆగిపోయాయి. అప్పటి నుంచి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆలూరు శాసనసభ్యుడు గుమ్మనూరుజయరాం చొరవతో... బస్సు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. బళ్లారి నుంచి హొళగుందకు బస్సు రావటంతో స్థానికులు ఘనంగా స్వాగతం తెలిపి... సన్మానం చేశారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు సన్మానం....ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతాం... - హొళగుంద
మూడేళ్ల తర్వాత తమ గ్రామానికి బస్సు రావటంతో... ఆనందంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. దీంతో బస్సు డ్రైవర్ కి సన్మానం చేసి..తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
holagunda people are very happy because of the bus came their village at karnool