ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide: సినిమా బాగోలేదని 'డై' హార్డ్ ఫ్యాన్ ఆత్మహత్య! - radheshyam news

ఇటీవల విడుదలైన తన అభిమాన హీరో సినిమాకు నెగిటివ్ టాక్​ వచ్చిందని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సినిమా తాను ఆశించినంతగా లేదని క్షణికావేశంలో నిండు జీవితాన్ని బలిచేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా తిలక్​నగర్​లో చోటుచేసుకుంది.

సినిమా బాగలేదని అభిమాని ఆత్మహత్య !
సినిమా బాగలేదని అభిమాని ఆత్మహత్య !

By

Published : Mar 13, 2022, 5:56 PM IST

Updated : Mar 13, 2022, 7:31 PM IST

తాను ఆరాధించే నటుడి సినిమా బాగోలేదని మనస్థాపం చెంది ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు నగరంలోని తిలక్ ​నగర్​లో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన రవి వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన అభిమాన నటుడి సినిమా విడుదల కావటంతో శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి థియేటర్​కు వెళ్లి సినిమా చూశాడు. అనంతరం ఇంటికి వచ్చిన రవి.. సినిమా తాను ఆశించినంతగా లేదని.., తన అభిమాన హీరో సినిమాపై ఫ్లాప్ టాక్​ నడుస్తోందని మనస్థాపం చెందాడు. అదే రోజు రాత్రి ఉరేసుకొని నిండు జీవితాన్ని బలిచేసుకున్నాడు.

ఊరికి వెళ్లిన తల్లి అతనికి ఫోన్ చేయగా..ఫోన్ ఎత్తలేదు. శనివారం ఉదయం స్నేహితులు ఇంటి తలుపులు తట్టినా స్పందించలేదు. దీంతో వెల్డింగ్ యంత్రంలో తలుపులు తొలగించి చూడగా.. పైకప్పుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

నేటి తరం యువత విపరీత ఆలోచనలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయని పోలీసులు అంటున్నారు. చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో తనువు చాలించటం తగదని హితవు పలికారు. ఏదైనా సమస్య ఎదురైనపుడు దాన్ని అధిగమించే ప్రయత్నం చేయకుండా ఆత్మహత్యే శరణ్యమనుకుని తమ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించటం సరైంది కాదని అంటున్నారు.

ఇదీ చదవండి

చెరువులో జారిపడి.. తాత, తండ్రి, మనవడు మృతి !

Last Updated : Mar 13, 2022, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details