కర్నూలు జిల్లా దిగువ అహోబిలంలో రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులను రథంలో కొలువుంచి అహోబిలం మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు భక్తులతో కలిసి రథాన్ని లాగారు.
ఘనంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం - ahobilam latest news
కర్నూలు జిల్లా అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. స్వామి నామస్మరణ చేస్తూ వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తి పారవశ్యంతో రథాన్ని లాగారు.
అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం
ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు గంగుల ప్రతాప్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తమ కుటుంబసభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అహోబిలం పరిసరాలు కిక్కిరిశాయి.
ఇదీచదవండి.