కర్నూలులో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా వివిధ రూపాల్లోని గణపయ్యలు పూజలందుకుంటున్నారు. నగరంలో అగ్గిపెట్టెలతో తయారు చేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అంతేగాక లక్ష అగ్గిపెట్టెలతో ఈ ప్రతిమను తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాల వెలుగులో పార్వతీ తనయుడిని పూజిస్తూ... భక్తితో ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు.
అగ్గిపెట్టెల గణపయ్య... ఆకర్షణగా నిలిచేనయ్య..!
వినాయక చవితి సందర్భంగా గణనాథుని మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రూపాలలోని గణనాథులు భక్తులకు దర్శనమిస్తున్నాడు.
ganesh made by match boxes at karnool district