ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గడప గడపలో ఎమ్మెల్యేకు షాక్.. పథకాలను చంద్రబాబే ఇస్తున్నాడన్న మహిళ - ఆదోనిలో ఎమ్మెల్యే సాయి

FUNNY INCIDENT AT ADONI : ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్​రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు పథకాలను వివరించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి.. ఆ మహిళ చెప్పిన సమాధానం విని అక్కడ ఉన్నవారంతా షాక్​కి గురయ్యారు. ఇంతకీ ఆ మహిళ ఏం చెప్పిందంటే..

FUNNY INCIDENT AT GADAPA GADAPA
FUNNY INCIDENT AT GADAPA GADAPA

By

Published : Oct 16, 2022, 1:09 PM IST

FUNNY INCIDENT AT GADAPA GADAPA : కర్నూలు జిల్లా ఆదోని పట్టణం వాల్మీకి నగర్లో నిర్విహించిన గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే సాయి.. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అయితే ఈ పథకాలను ఎవరు ఇస్తున్నారని ఈరమ్మ అనే మహిళను అడగగా.. చంద్రబాబు ఇస్తున్నాడని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే షాక్​కు గురయ్యారు. జగన్‌ ఫోటోను సైతం గుర్తుపట్టని మహిళను చూసి కార్యకర్తలు నవ్వుకున్నారు.

గడప గడప కార్యక్రమంలో సరదా సన్నివేశం

ABOUT THE AUTHOR

...view details