ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐపీఎల్​ బెట్టింగ్​కు పాల్పడ్డ ఐదుగురు అరెస్టు - kurnool crime news

కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 1,22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.

five members arrested at adhoni for doing ipl betting
ఐపీఎల్​ బెట్టింగ్​కు పాల్పడ్డ ఐదుగురు అరెస్టు

By

Published : May 1, 2021, 12:31 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 1,22,000 నగదు, 15 సెల్​ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాములు తెలిపారు. పట్టణంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో.. పోలీసులు దాడులు నిర్వహించారు. బెట్టింగ్​కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీరాములు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details