ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతరో జాతర..నెల రోజుల జాతర ఇది - farmers jathara

పండుగలు, జాతరలు సంప్రదాయాన్ని తర్వాత తరాలకు మోసుకొచ్చే వారధులు. ఒకటి, రెండు రోజుల పాటు జరిగే జాతరలను చూసి ఉంటాం. కానీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జాతర మాత్రం ఏకంగా నెలరోజుల పాటు సాగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, కేవలం రైతుల కోసమే ఈ జాతర కొనసాగుతుంది .

ఎమ్మిగనూరులో రైతుల జాతర
ఎమ్మిగనూరులో రైతుల జాతర

By

Published : Jan 23, 2022, 9:53 AM IST

ఎమ్మిగనూరులో రైతుల జాతర

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వరస్వామి జాతర కోలాహలంగా సాగుతోంది. నెలరోజుల పాటు జరిగే ఈ జాతరలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈనెల 19న స్వామి వారి రథోత్సవం, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు. నాటి నుంచి నెల రోజులపాటు ఈ జాతరను జరుపుకుంటారు. సుమారు మూడు వందల ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ జాతరను కేవలం రైతుల కోసమే నిర్వహించడం విశేషం. జాతరలో భాగంగా పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు వ్యవసాయం కోసం కోడెలు, ఎద్దులను కొనుగోలు చేస్తారు.

పశువుల కొనుగోళ్లతోపాటు వ్యవసాయానికి అవసరమైన అన్ని పనిముట్లు జాతరలో అమ్ముతారు. నాగళ్లు, ఎడ్ల బండ్లు, చక్రాలు, ఎద్దుల అలంకరణ వస్తువులు ఇలా అన్నీ విక్రయిస్తారు. మరోవైపు వివిధ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను వీక్షించేందుకు జనం భారీగా వస్తారు. ఇవి కాకుండా వివిధ క్రీడా పోటీలు, పద్యనాటకాల ప్రదర్శనలు నెలరోజుల పాటు అట్టహాసంగా జరుగుతాయి. పిల్లలకు బొమ్మలు, తినుబండారాల అమ్మకాలతో జాతర కిటకిటలాడుతోంది.

ఎమ్మిగనూరు జాతరే జిల్లాలో మొదటి ప్రారంభమయ్యే జాతరగా చెబుతారు. దీని తర్వాతే మిగిలిన జాతరలు ప్రారంభమవుతాయి.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details