ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజిలెన్స్​ తనిఖీలో భారీగా పట్టుబడ్డ నకిలీ విత్తనాలు - veldurthi

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పత్తి విత్తనాల నకళ్లను విజిలెన్స్​ అధికారులు పట్టుకున్నారు. వీటి ఖరీదు 30 లక్షలు ఉండవచ్చని భావిస్తున్నారు.

విజిలెన్స్​ తనిఖీలో భారీగా పట్టుబడ్డ నకిలీ విత్తనాలు

By

Published : Jul 7, 2019, 10:17 PM IST

విజిలెన్స్​ తనిఖీలో భారీగా పట్టుబడ్డ నకిలీ విత్తనాలు

కర్నూలు జిల్లా వెల్దుర్తిలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు అధికారులు పట్టుకున్నారు. వెల్దుర్తిలో ఓ వ్యాపారి తన ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు BT3 రకం తయారు చేసి రైతులకు అమ్ముతున్నాడు. వీటిపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు ఆదివారం దాడులు చేశారు. మూడు సంవత్సరాలుగా ఈ వ్యాపారి నకిలీ విత్తనాలు తయారీ చేస్తున్నాడని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ ఏఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. వీటి విలువ దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. విత్తనాలు పావని అనే పేరు పైన అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తనాల తయారీ యంత్రం, రసాయనాలు, ప్యాకింగ్ యంత్రం స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details