కర్నూలు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ భీంరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఎలుగుబంటి సెల, ఎదురుమొత్తే, మామిడి సెల, స్తంభాలసెల ప్రాంతాల్లో సారా బట్టీలపై దాడులు చేసి 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో నాటు సారా సరఫరా ఎక్కువగా ఉండటం... శ్రీశైలంలో అబ్కారీ కార్యాలయం లేకపోవటంతో సారాయి బట్టీలపై దృష్టి సారించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. త్వరలోనే సున్నిపెంటలో ఎక్సైజ్ శాఖ అవుట్ పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు.
శ్రీశైలం అడవుల్లో అబ్కారీశాఖ దాడులు - kurnool
శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో నాటుసారా బట్టీలపై అబ్కారీశాఖ అధికారులు దాడులు జరిపారు. రెండు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఎక్సైజ్ శాఖ దాడులు