"తెదేపా శ్రేణులపై దాడులను సహించేది లేదు" - tdp
తెదేపా శ్రేణులపై వైకాపా దాడులను సహించేది లేదని తెదేపా మాజీ శాసనసభ్యుడు మీనాక్షి నాయుడు తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ex_mla_minakshinaidu_fires_om_ycp
ఈ మధ్య కాలంలో తెదేపా కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ శాసన సభ్యుడు మీనాక్షి నాయుడు తెలిపారు. కర్నూలు పట్టణంలోని భూపాల్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపాను ప్రతి ఒక్కరూ అభిమానించేవారని మీనాక్షి నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా.. అని దాడులు చేస్తే సమష్ఠిగా ఉండి ఎదుర్కొంటామని తెలిపారు.