వైభవంగా సుబ్రమణ్యస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - panyam
కర్నూలు జిల్లా పాణ్యంలోని కొత్తూరు మండలంలోని కొత్తూరు గ్రామంలో ధ్వజస్తంభాన్ని ఘనంగా ప్రతిష్టించారు.
సుబ్రమణ్య స్వామి ధ్వజస్తంభం ప్రతిష్ట
కర్నూలు జిల్లా పాణ్యంలోని కొత్తూరు మండలంలోని కొత్తూరు గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమా నాగ లింగేశ్వర స్వామి ధ్వజస్తంభాన్ని నెలకొల్పారు. వేద మంత్రాల మధ్య భక్త జనసమూహం భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.