ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ... ఏఎన్ఎంలుల రేపు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన కర్నూలు జిల్లా ఏఎన్ఎంలను డోన్ రైల్వేస్టేషన్లో పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ వెళ్లేందుకు రైల్వేస్టేషన్ చేరుకున్నారన్న సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేనందునే వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
కర్నూలులో ఏఎన్ఎంల ముందస్తు అరెస్టు - arrest of ANMs
కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్లో ఏఎన్ఎంలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఏఎన్ఎంల ముందస్తు అరెస్టు