రాష్ట్రవ్యాప్తంగా దసరా బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల మహక్షేత్రంలో భ్రమరాంబదేవి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో లవన్న దంపతులు, అర్చకులు, వేదపండితులు వేడుకలను ప్రారంభించారు. శాస్త్రోక్తంగా గణపతి పూజ, కంకణపూజ, పుణ్యాహవచనం పూజలు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
Dussehra celebrations: శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీభ్రమరాంబదేవి
రాష్ట్రవ్యాప్తంగా దసరా(Dussehra celebrations) వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబదేవి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో లవన్న దంపతులు, అర్చకులు, వేదపండితులు వేడుకలను ప్రారంభించారు.
శ్రీశైలమహక్షేత్రంలో దసరా వేడుకలు ప్రారంభం
సాయంత్రం శ్రీభ్రమరాంబదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి ఘటస్థాపన పూజలు నిర్వహించారు. గ్రామ దేవత మంచాలమ్మ ఆదిలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: