నకిలీ పోలీసు..దొరికాడు - పోలీసులు
నకిలీ పోలీసు అవతారం ఎత్తి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని కర్నూలు జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు వెల్లడిస్తున్న కర్నూలు డీఎస్పీ శ్రీనివాసులు
సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశతో ఓ వ్యక్తి నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పోలకల్ గ్రామానికి చెందిన బూడిదపాడు రాజు నకిలీ పోలీస్ అవతారం ఎత్తాడు.కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల పరిధిలో నేరాలకు పాల్పడ్డాడు. అతడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడు నుంచి ఆరు లక్షల 25 వేల రూపాయల నగదు, మూడు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.