కర్నూలులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కర్నూలు సివిల్ ఫోరం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ శాఖ మంత్రికి ఎస్ఎంఎస్ రూపంలో వారి సమస్యను తెలియజేశారు. నగరానికి చుట్టూ రెండు జీవ నదులున్నా.. తాగడానికి నీరు మాత్రం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లే ఇక్కడ తాగునీటి సమస్య ఏర్పడిందని..వారే పట్టించుకుంటే ఇదీ చాలా చిన్న సమస్యని సివిల్ ఫోరం సభ్యులు చెన్నయ్య అన్నారు. ప్రస్తుతం ఒక్క సమ్మర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. దీంతో ఏ మాత్రం నీరు అదంటంలేదనీ.. ఇంకొకటి నిర్మించి కర్నూలుకు శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేయాలని కోరుతున్నారు. మా కోసం మిగిలినవారు మున్సిపల్ కమిషనర్‌కి మేసేజ్ చేయడంటూ అడుగుతున్నారు.
'మాకు నీళ్లు కావాలి..మీరూ ఎస్ఎమ్ఎస్ చేయండి!' - water problem at kurnool
మాకు నీళ్లందటం లేదంటే అధికారులు వినడంలేదు..ఎం చేయాలి..? అందుకేనేమో కర్నూలు సివిల్ ఫోరం కాస్త భిన్నంగా ఆలోచించింది. ఎస్ఎమ్ఎస్ ద్వారా తమ సమస్యను చెప్పడం మొదలుపెట్టింది... మీరూ మాతో ఏకీభవించండంటూ ప్రజలకు పిలుపునిచ్చింది.
'మా నీళ్ల కోసం మీరూ ఎస్ఎమ్ఎస్ చేయండీ..!'