కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖ్లీలో పట్టుబడ్డ నాటుసారా, కర్ణాటక అక్రమ మద్యం సీసాలను పోలీసులు రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు. అదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మొత్తం 410 కేసులో పట్టుబడిన 11 వేల 300 లీటర్ల నాటు సారా, మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి అన్నింటిని రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. కోటి 20 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.
ఎమ్మిగనూరులో ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో 350 కేసుల్లో సీజ్ చేసిన 6130 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ చెప్పారు. అక్రమ మద్యం తరలింపులో సీజ్ చేసిన వాహనాలను వేలం వేయగా రూ. 60లక్షలు రాగా.. వాటిని ట్రెజరిలో జమ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.