శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 818 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా... ఇప్పుడు జలాశయంలో 39.4343 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
srisailam: శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటిమట్టం - Srisailam reservoir water flow news
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం నిలిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 818 అడుగుల మేర నీరుంది.
Srisailam reservoir
విద్యుత్ ఉత్పత్తితో 21,189 క్యూసెక్కుల నీరు దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 9.706 మెగావాట్ల ఉత్పత్తి ఉత్పత్తి జరిగింది.
ఇదీ చదవండి:KRISHNA WATER: కడలిలోకి కృష్ణమ్మ.. రోజూ అర టీఎంసీ వృథా