''రాయలసీమ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'' - kurnool
రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని విజ్ఞుప్తి చేశారు.
కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు లేక రైతులు విలవిలలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సైతం దక్కని పరిస్థితి నెలకొందని... వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టితో ప్రజలను అతలాకుతలం చేస్తుంటే ఇక్కడి ప్రజలు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకునేందుకు ఈనెల 25వ తేదీన విజయవాడలో బాధిత రైతు కుటుంబాలతోనే ముఖాముఖి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.