సీపీఐ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి రామాంజనేయులు.. జనానికి ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రయత్నించారు.ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచారు.. కంకి కొడవలి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. వీటితో పాటు.. టీ అమ్మారు. ద్విచక్ర వాహనాలకు పంచర్లు వేశారు. వామపక్షాలు, జనసేన పొత్తులో భాగంగా డోన్ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.