అప్పుల బాధ భరించలేక భార్యాభర్తలిద్దరూ ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. స్థానిక జగజ్జనని నగర్ సమీపంలోని ఫాతిమా వీధిలో నివసిస్తున్నషేక్ నూర్ బాషా, షేక్ షాహిన్ దంపతులు కొంతమంది వద్ద అప్పు తీసుకున్నారు. అయితే.. అప్పులిచ్చిన వారంతా డబ్బులివ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు.
COUPLE SUICIDE ATTEMPT: అప్పుల బాధ భరించలేక.. దంపతుల ఆత్మహత్యాయత్నం - AP NEWS
అప్పుల బాధలు భరించలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఎలుకల మందు తాగారు.
అప్పుల బాధ భరించలేక దంపతుల ఆత్మహత్య
లక్ష రూపాయలకు వారానికి పదివేల వడ్డీ చెల్లిస్తున్నారట. ఎన్ని డబ్బులు కడుతున్నా అప్పులు తీరకపోవడంతో.. తీవ్ర ఆందోళనకు గురై, బతుకు భారంగా భావించి, దంపతులిద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. విషయం గుర్తించిన స్థానికులు.. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి:
ఆదివాసీ మహిళపై అమానుషం.. మీద నీళ్లు పోసి..