కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో ఇవాళ 7 పాజిటీవ్ కేసులు నమోదకాగా.. గురువారం కూడా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం జిల్లాలలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 547కు చేరింది. గురువారం 23 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 191 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనాతో బాధపడుతూ గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 14కు చేరింది. మిగిలిన 342 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కర్నూలులో కరోనా వ్యాప్తి తగ్గుముఖం - corona virus news in ap
కరోనా వైరస్ వ్యాప్తి.. కర్నూలులో క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. రెండు రోజులుగా.. నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గింది. ఇవాళ జిల్లాలో 7 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 547కు చేరింది.
Corona prevalence decreasing in kurnool