బాలుర సంక్షేమ వసతి గృహంలో కలెక్టర్ బస
సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ బస చేశారు. విద్యార్థులు సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
collector-visit-boys-hostel
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మిక పర్యటన చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో గురువారం రాత్రి బస చేశారు. వసతి గృహంలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు. హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ శివార్లలోని గిరిజన పాఠశాలను సందర్శించారు. అక్కడి సౌకర్యాలు బాగా లేకపోవడంపై మండిపడ్డారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.