ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెరుగుతున్న కేసులతో భయపడకండి' - kurnool district

కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో లాక్ డౌన్ అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యతో ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు.

లాక్ డౌన్ పై కలెక్టర్ సమీక్ష
లాక్ డౌన్ పై కలెక్టర్ సమీక్ష

By

Published : Apr 27, 2020, 6:25 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో లాక్ డౌన్ అమలుపై కలెక్టర్ వీరపాండ్యన్ సమీక్ష నిర్వహించారు. పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూసి ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. ఎక్కువ నమూనాలను సేకరించి పరిక్షిస్తే ఫలితాల్లో ఎక్కువగా పాజిటివ్ వస్తుందని చెప్పారు. దీనివల్ల కరోనా వ్యాప్తి నియంత్రణకు దోహదపడతుందని అన్నారు.

జిల్లాలో 7500 నమూనాలు సేకరించి పరీక్షకు పంపినట్లు తెలిపారు. 1100 నమూనాలకు చెందిన ఫలితాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అజయ్ జైన్, జిల్లా ఎస్పీ పక్కిరప్ప, పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details