కర్నూలు జిల్లా మహానంది మండలంలో ఈనాడు-ఈటీవీ ఇచ్చిన మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమానికి, విద్యార్దుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఎం.తిమ్మాపురంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్ధులంతా ఉత్సాహంగా మట్టి గణనాథులను తయారుచేశారు. రంగు విగ్రహాలతో కలుషితం అవుతున్న పర్యావరణంతో, చివరకు ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల ప్రధానాచార్యులు నరేష్ అన్నారు. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్దులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మట్టివిగ్రహాలపై ఈనాడు-ఈటీవీ పిలుపుకు విశేష స్పందన - కర్నూలు జిల్లా
ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎం.తిమ్మాపురంలోని ఆదర్శ పాఠశాల విద్యార్ధులు ఉత్సహాంగా పాల్గొన్నారు. మట్టి గణనాథులను తయారు చేసి, పర్యవరణాన్ని కాపాడుతామని చెప్పారు.
ఈనాడు ఆధ్వర్యంలో మట్టి వినాయకుల తయారి