ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైద్య కళాశాలకు మరోచోట స్థలం కేటాయించాలి' - పరిశోధనా స్థానం భూములను వైద్యకళాశాలకు

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూముల్లో వైద్యకళాశాలకు స్థల కేటాయింపు నిర్ణయంపై సీఐటీయూ నిరసన చేపట్టింది. కళాశాలకు వేరేచోట స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేసింది.

citu protest
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం

By

Published : Nov 21, 2020, 10:18 PM IST

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు కేటాయించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాలలో నిరసన వ్యక్తమవుతోంది. సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ధర్నా చేపట్టారు. పరిశోధన స్థానం భూములను తగ్గించవద్దని కోరారు. సంబంధిత జీవోను రద్దు చేసి, వైద్యకళాశాలకు మరోచోట స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details