ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి అఖిలప్రియకు సీఐడీ నోటీసులు - భూమా అఖిల ప్రియకు సీఐడీ నోటీసులు న్యూస్

కరోనా వ్యాప్తికి కర్నూలు ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ కారణమంటూ... మాజీమంత్రి అఖిలప్రియ, భాజపా, జనసేన నాయకులు ఆరోపించారని ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ గతంలో చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ.. సీఐడీకి ఫిర్యాదు చేశారు.

మాజీ మంత్రి అఖిలప్రియకు సీఐడీ నోటీసులు
మాజీ మంత్రి అఖిలప్రియకు సీఐడీ నోటీసులు

By

Published : Sep 24, 2020, 4:04 AM IST

తనపై ఆరోపణలు చేశారంటూ.. ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు మాజీమంత్రి అఖిలప్రియకు నోటీసులు జారీ చేశారు. అఖిలప్రియ, భాజపా, జనసేన నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. హాఫీస్ ఖాన్ మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐడీ అధికారులు మే 12న కేసు నమోదు చేశారు. సీఐడీ విభాగాధిపతి సునీల్ కుమార్ ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీ కర్నూలు ప్రాంతీయ కార్యాలయం డీఎస్పీ వెంకటేశ్వర రావుకు అప్పగించారు. ఈ కేసులో అఖిలప్రియను విచారించేందుకు సీఐడీ ఎస్సై పవన్ కుమార్ మాజీ మంత్రిని కలిసి నోటీసు పత్రం అందజేశారు. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details