ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం - శ్రీశైలం తాజా వార్తలు

శ్రీశైలంలో అన్యమతం పార్శిల్ కలకలం రేపింది. శ్రీశైలం పర్యాటకశాఖ ఉద్యోగి కుటుంబానికి క్రిస్టియన్​ సంస్థను నుంచి పార్శిల్ వచ్చినట్లు సమాచారం. శ్రీశైలం దేవస్థానం అధికారులు పార్శిల్​ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం
శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం

By

Published : Sep 24, 2020, 3:56 PM IST

Updated : Sep 24, 2020, 5:32 PM IST

శ్రీశైలంలో అన్యమత పార్శిల్‌ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్శిల్ రావడంతో స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో దేవస్థానం ఇన్‌ఛార్జి చీఫ్‌ సెక్యూరిటీ అధికారి శ్రీహరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పార్శిల్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పోలీసులు ఆ పార్శిల్‌ను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. ఆలయంలోని పర్యాటక శాఖలో పనిచేసే ఓ ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి పార్శిల్ వచ్చినట్లు చిరునామా ఆధారంగా పోలీసులు గుర్తించారు. పార్శిల్ వచ్చిన వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో నిత్యావసర వస్తువులను సదరు క్రిస్టియన్ సంస్థ పంపినట్లు తేలింది. దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలంలో అన్యమత ప్రచార కార్యకలాపాలు నిషేద్ధం. అన్యమత పార్శిల్‌ కర్నూలు నుంచి శ్రీశైలానికి రావడంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి :సత్రాల భవన నిర్మాణానికి సీఎంలు జగన్, యడియూరప్ప భూమిపూజ

Last Updated : Sep 24, 2020, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details