ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం - ఆత్మీయ

ఎన్నికల వేళ గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీలోని అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని నేతలు హామీ ఇచ్చారు.

వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం

By

Published : Apr 2, 2019, 2:59 PM IST

వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం
కర్నూలు జిల్లా కోడుమూరులో వైకాపా ఆధ్వర్యంలో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ముందుగా ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్​లు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం నుంచి వాసవి కల్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు బీసీల్లో కొంతమందికి మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. జగన్ ముఖ్యమంత్రి అయితే బీసీల్లో ఉన్న అన్ని కులాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని సంజీవ్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details