నేటి నుంచి 3 రోజులు పాటు తెదేపా చండీహోమం - AP
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, చండీహోమం చేస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోఈ హోమం నిర్వహించనున్నారు.
నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చండీ హోమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలని హోమం చేస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో హోమం నిర్వహించామన్నారు. ఇప్పుడు అదే తరహాలో కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రైతులు సంతోషంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ముఖ్య నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు, మంత్రులు పాల్గొనున్నారని తెలిపారు.