కర్నూలు జిల్లా అవుకు పట్టణానికి చెందిన వైకాపా నేత చల్ల భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడంతో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని చల్లా భగీరథ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తానని ఆయన వెల్లడించారు.
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా చల్లా భగీరథ రెడ్డి
కర్నూలు జిల్లాకు చెందిన చల్లా భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తునట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తానని భగీరథ రెడ్డి పేర్కొన్నారు.
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా చల్ల భగీరథ రెడ్డి