కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. కడప జిల్లాకు చెందిన రైతుల పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ సన్నాహాలు చేస్తోంది.
రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు. కనీస మద్దతు ధర రూ.5100 నుంచి 5300 ఉంటుందని పేర్కొన్నారు. ఈ దిశగా రైతులు తమకు సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.