స్నేహితులతో కలిసి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి - tractor
ఐదుగురు స్నేహితులు కలిసి ఓ పని కోసం కారులో బయలు దేరారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాగుతున్న వారి ప్రయాణంలో ప్రమాదం జరిగింది. బృందంలోని ఒకరు మృతి చెందడం.. అంతులేని విషాదాన్ని నింపింది.
ప్రమాదంలో దెబ్బతిన్న కారు
కర్నూలు నగర శివార్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు... తుంగభద్ర నది సమీపంలో ట్రాక్టర్ను ఢీ కొంది. ఈఘటనలో కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.... చికిత్స పొందుతూ సమీర్ కుమార్ అనే వ్యక్తి మృతిచెందాడు. సాగర్, రాజేష్, రఘనందన్, ప్రశాంత్ అనే మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా బెంగళూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.