భాజపాకు ఒక్క అవకాశం ఇస్తే అమరావతిని మూడు సంవత్సరాల్లోనే నిర్మిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ ఏకగ్రీవాలకు పాల్పడిందని ఆరోపించారు. కర్నూలులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన... అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలు చేపట్టడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాజధానికి ఎక్కడ శంకుస్థాపన చేస్తే అక్కడే నిర్మించాలని.. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని అన్నారు.
'భాజపాకు అవకాశం ఇస్తే.. మూడేళ్లలోనే అమరావతిని నిర్మిస్తాం' - సోమువీర్రాజు నేటి సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా బలవంతపు ఏకగ్రీవాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపాకు అవకాశమిస్తే మూడేళ్లలోనే అమరావతిని నిర్మిస్తామని వెల్లడించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు