ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న కాలనీ ఇళ్లలో చాలా అవినీతి జరిగింది : సోము వీర్రాజు

Somu Veerraju : వైసీపీ హయాంలో ప్రజలపై దాడులు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని కల్లూభావి ప్రాంతంలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున... ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆయన....అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో జగనన్నఇళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.

సోము వీర్రాజు
సోము వీర్రాజు

By

Published : Feb 6, 2023, 7:51 PM IST

Somu Veerraju: కర్నూలు జిల్లా ఆదోని లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. పట్టణంలోని కల్లూభావి ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. అనంతరం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దాడులు పెరిగాయని.. దాడుల వల్ల ప్రభుత్వం చాలా మూల్యం చెల్లించుకుంటుంది అన్నారు. రాష్ట్రంలో జగనన్న కాలనీ ఇళ్లలో చాలా అవినీతి జరిగిందన్నారు.. 6లక్షల ఎకర ఉన్న పొలం 30 లక్షలు కొన్నట్లు చూపించి నాయకులు దోచుకుంటుందని అన్నారు.

ఒక్కో కుటుంబానికి 45 వేలిస్తున్నాం..రెండుసార్లు బియ్యం ఇస్తున్నాం. బియ్యానికి కేజీ రూ.35 ఇస్తున్నాం. 50 లక్షల మందికి రూ. 6000 ఇస్తున్నాం. ఎరువుల మాటకొస్తే రూ. 2000 చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. మరి మీరేం చేస్తున్నారండి. అప్పులు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, ఇసుకను అమ్మేస్తున్నారు, పరిపాలన చేయకుండా.. ఎమ్మెల్యేలు ప్రభుత్వం కలిసి కోట్ల రూపాయల అవినీతి చేసి దోచుకోవడమే వైసీపీ పార్టీ యొక్క ధ్యేయం -సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details