ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో ఆ పార్టీలతో పొత్తుల్లేవ్ :  సునీల్ దేవధర్ - bjp on ap alliance

ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని భాజపా.. రాష్ట్ర బాధ్యుడు సునీల్ దేవధర్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఎవరితోనే ఎటువంటి పొత్తులు లేవని స్పష్టం చేశారు.  దేశప్రయోజనాల కోసమే పలు పార్టీలు ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు పలికాయన్నారు.

ఏపీలో ఆ.. పార్టీలతో పొత్తుల్లేవ్ :  సునీల్ దేవధర్

By

Published : Oct 17, 2019, 9:15 PM IST

ఏపీలో ఆ.. పార్టీలతో పొత్తుల్లేవ్ : సునీల్ దేవధర్
ఆంధ్రప్రదేశ్​లో ఏ పార్టీతోనూ పొత్తుగాని, అవగాహన ఉండదని భాజపా స్పష్టం చేసింది. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలులో పర్యటించిన భాజపా ఏపీ ఇన్​ఛార్జి సునీల్ దేవధర్ ఆయన... తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తు ఉండబోదన్నారు. ఈ విషయం తన వ్యక్తిగతం కాదని, ప్రధాని మోదీ సహా పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన తర్వాతే ఈ విషయం స్పష్టం చేస్తున్నామన్నారు. జనసేన, వైకాపాలతో ఎలాంటి అవగాహన లేదన్నారు. తెదేపా, వైకాపా నుంచి నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరుతున్నట్లు చెప్పారు. దేశప్రయోజనాల కోసం పార్లమెంటులో కొన్ని బిల్లుల ఆమోదం కోసం... తెదేపా, వైకాపాలు మద్దతు తెలిపాయన్నారు. అంతే తప్ప ఆ పార్టీలతో ఎటువంటి పొత్తులలు లేవన్నారు. మహారాష్ట్ర, హరియాణాల్లో భాజపా భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details