ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కృష్ణా నదిపై బ్రిడ్జ్‌ కమ్‌ బ్యారేజ్‌‌ని నిర్మిస్తే..రాయలసీమకు మేలు జరుగుతుంది' - BJP leader Byreddy comments

BJP leader Byreddy comments: కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన నిర్మిస్తే అది సెల్ఫీలకు మాత్రమే పనికొస్తుందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దాని స్థానంలో బ్రిడ్జ్‌ కమ్‌ బ్యారేజ్‌ నిర్మిస్తే రాయలసీమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

By reddy
బీజేపీ నేత

By

Published : Jan 28, 2023, 11:00 PM IST

BJP leader Byreddy comments: కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన నిర్మిస్తే.. అది సెల్ఫీలకు, సినిమా షూటింగులకు మాత్రమే పనికొస్తుంది తప్ప..రాయలసీమ ప్రజలకు ఏమాత్రం పనికిరాదని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా నదిపై సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జ్‌ కమ్‌ బ్యారేజ్‌‌ని నిర్మిస్తే.. రాయలసీమకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపంలోని కృష్ణా నదిని ఆయన పరిశీలించారు. రాయలసీమ తరతరాలుగా అన్యాయానికి గురవుతోందని ఆవేదన చెందారు. ఉయ్యాల వంతెన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తు చేశారు.

గతకొన్ని రోజులక్రితం వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం చేయొద్దని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా.. తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కార్యాలయం సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ క్రమంలో కృష్ణా నదిపై వంతెన నిర్మించాలనే డిమాండ్‌తో నేడు చలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కృష్ణా నదితో ఏమాత్రం సంబంధం లేని విశాఖకు కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దాన్ని కర్నూలుకు తరలించాలని బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

కృష్ణానదిపై తీగెల వంతెనను నిర్మించమని ఎవరు మీకూ పర్మిషన్ ఇచ్చారు. మా దరిద్రాన్ని తీర్చడానికా.. ఈ తీగెల వంతెన సెల్ఫీలు దిగడానికి, సినిమా షూటింగులకు మాత్రమే పనికి వస్తుంది తప్ప.. రాయలసీమ ప్రజలకు ఏమాత్రం పనికిరాదు. ఇక్కడ బ్రిడ్జ్‌ కమ్‌ బ్యారేజ్‌‌ని కట్టామని డిమాండ్ చేస్తున్నా. బ్రిడ్జ్‌ కమ్‌ బ్యారేజ్‌‌ని గనుకు కడితే 60 నుంచి 70 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అప్పుడు రాయలసీమ ప్రజలకు సాగునీరు, తాగునీరు, వ్యవసాయానికి నీరు అందుతుంది. ఊరికే అన్ని చిల్లర ప్రాజెక్టులు కట్టి 75 సంవత్సరాలుగా మోసం చేస్తున్నారు.- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ నేత

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details